కేరళ సీఎంతో భేటీ అయిన కమల్ హాసన్

vijiపాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్.కర్ణాటక పాలిటిక్స్ పైనా స్పందించారు ఇద్దరు నేతలు. ప్రజస్వామ్యమే గెలిచిందని చెప్పారు. ఇప్పటికే పార్టీ పెట్టిన కమల్ హాసన్ కేరళ వెళ్లారు. సీఎం విజయన్ తో భేటీ అయ్యారు. త్వరలో పార్టీ పెడతానని చెప్పిన రజినీ కాంత్ ఆదివారం(మే-20)మహిళా నేతలతో సమవేశమయ్యారు.

మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ కేరళ సీఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు. కేరళ పర్యటనలో ఉన్న కమల్ హాసన్.. సీఎంను కలిశారు. పార్టీ నిర్మాణంతో పాటు.. ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్టు చెప్పారు. కేరళలో అమలవుతున్న పథకాల గురించి విజయన్ తో మాట్లాడానన్నారు.
పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నరజినీకాంత్.. ఇప్పటికే పార్టీ ప్రకటించిన కమల్ హాసన్ ఇద్దరు కూడా ఫ్యూచర్ ప్లానింగ్ లో బిజీ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates