కేరాఫ్‌ కంచరపాలెం : నిర్మాతగా రానా

RANAబాహుబలితో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రానా నిర్మాతగా మారాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కేరాఫ్‌ కంచరపాలెం అనే సినిమాను సమర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం (ఏప్రిల్-3) ట్విటర్‌ ద్వారా తెలిపాడు రానా. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కేరాఫ్‌ కంచరపాలెం సినిమాను సమర్పిస్తుండటం చాలా సంతోషంగా ఉందని.. ఈ పెద్ద.. చిన్న సినిమాను మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉంది అని ఓ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఫోస్టర్ ని పోస్ట్ చేసిన రానా.. కేరాఫ్‌ కంచరపాలెం సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు. న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా ఇది. ఇలాంటి సినిమాను సమర్పిస్తుండటం చాలా గర్వంగా ఉంది అని మరో ట్వీట్‌ చేశాడు రానా. వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు డైరెక్షన్. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates