కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌రాజ్‌

KCR PRAKASH RAJతెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. గురువారం (మార్చి-29) సీఎం కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. అనంతరం ప్రకాశ్‌రాజ్‌ అసెంబ్లీని సందర్శించారు. BJP, కాంగ్రెస్‌ యేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్‌ సమాయత్తమవుతున్న క్రమంలో  ప్రకాశ్‌రాజ్‌ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కోల్‌కతాకు వెళ్లి బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఫెడరల్ ‌ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు.

మరిన్ని రాజకీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. బుధవారం (మార్చి-28)  జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కూడా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. గురువారం ప్రకాశ్ రాజ్  కేసీఆర్‌ను కలవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను మోడీ వ్యతిరేకనని ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్‌రాజ్‌, కేసీఆర్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది.

 

Posted in Uncategorized

Latest Updates