కేసీఆర్‌ కు సైకత చిత్రంతో అభినందనలు

కురవి : తెలంగాణ రాష్ట్రం సాధించిపెట్టిన కేసీఆర్‌ అంటే అతనికి గౌరవం… రాష్ట్ర అభివృద్ధి అతనితోనే సాధ్యమని నమ్ముతాడు అతను.. తన అభిమాన నేత మరోసారి సీఎం కావాలని ఆయన ఆకాంక్షించాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంతో కేసీఆర్ కు అభినందనలు తెలపాలని భావించాడు ఆయన. ఇసుక, ఫెవికాల్‌ వినియోగించి కేసీఆర్‌ శాశ్వత సైకత చిత్రాన్ని రూపొందించాడు… అందులో తెలంగాణ సూరీడు కేసీఆర్‌కు అభినందనలు అంటూ ఇంగ్లిషులో పొందుపరిచాడు. ఈ చిత్రాన్ని రూపొందించేందుకు 40 గంటలు శ్రమించినట్లు తెలిపాడు మహబూబాబాద్‌ మండం కురవి మండలానికి చెందిన ఇన్నోవేటివ్‌ ఆర్టిస్టు నీలం శ్రీనివాస్‌. త్వరలోనే దీన్ని కేసీఆర్‌కు బహూకరిస్తానన్నాడు శ్రీనివాస్.

Posted in Uncategorized

Latest Updates