కేసీఆర్‌ పాలననే కోరుకున్నారు ప్రజలు : ఎమ్మెల్యే హరీశ్‌రావు  

సిద్దిపేట: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం బాధ్యతగా పనిచేశానన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిచిన హరీశ్‌రావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిన్న(శనివారం) సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవులకు క్రిస్మస్‌ బహుమతుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో ముందు వరుసలో ఉంచిన కేసీఆర్‌ అంటే ప్రజలకు నమ్మకమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేసీఆర్‌ పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని  చెప్పారాయన. పార్టీ అధినాయకుడి ఆదేశాల మేరకు తాను ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లినా… ఇక్కడి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అంకితభావంతో పనిచేశారని, రికార్డు స్థాయిలో 1,18,699 ఓట్ల భారీ మెజార్టీతో తనను గెలిపించారని, వారికి జీవితాంతం రుణపడి ఉన్నానని, వారి సేవలో తరించడమే తన లక్ష్యమన్నారు హరీశ్‌రావు.

Posted in Uncategorized

Latest Updates