కేసీఆర్ ఆంధ్రాకు రావాలి.. జగన్ ను గెలిపించాలి : పోసాని

తెలంగాణ ప్రజలు చాలా చక్కటి తీర్పు ఇచ్చారని చెప్పారు సినీ దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి. కేసీఆర్ గెలవాలని సాయిబాబాకు, కనకదుర్గకు మొక్కుకున్నానని అన్నారు. తెలంగాణ ప్రజలు నిజాయితీ పరులని చెప్పిన పోసాని… మహాకూటమి అనే దుష్ట త్రయం వచ్చి ప్రచారం చేస్తే తిప్పికొట్టారని అన్నారు. ఆంధ్రలో కమ్మ దురదను చంద్రబాబు పుట్టించారని… కమ్మ అనే కులం పేరుతో ఓట్లు వేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కులాన్ని ఐడెంటిటీ కోసం మాత్రమే వాడాలన్నారు. జగన్ కు ఉన్న ఫాలోయింగ్ చంద్రబాబుకు లేదన్నారు పోసాని. కేసీఆర్ చెప్పినట్టుగా.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్నారు. ఆంధ్రలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు లక్షల్లో ఉన్నారని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవాడనికి కేసీఆర్ వచ్చి ప్రచారం చేయాలని కోరారు.

సుహాసిని అందుకే ఓడిపోయింది

కమ్మ దురద ఉన్న చంద్రబాబు అదే కుల పిచ్చిని కూకట్ పల్లిలో చూపించాలనుకుని బోల్తాపడ్డారని అన్నారు పోసాని. ఇన్నేళ్లలో ఆంధ్రులందరినీ తెలంగాణ వాళ్లుగా కేసీఆర్ చూడటం వల్లే… అక్కడున్న వారికి కులపిచ్చి అంటుకోలేదని … అందుకే సుహాసిని ఓడిపోయిందని చెప్పారు. చంద్రబాబు క్యాస్ట్ పాలిటిక్స్ ను ప్యాకేజీలాగా దింపినా.. తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates