కేసీఆర్ ఆలోచనలు అద్భుతం : బాబా రాందేవ్

KCR RAMDEVతెలంగాణ సీఎం కేసీఆర్ ముందుచూపు ఉన్న నేత అని యోగా గురువు బాబా రాందేవ్ ప్రశంసించారు. అభివృద్ధి విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరును అభినందించారు. పలు అంశాలపై సీఎంకు స్పష్టత ఉందని చెప్పారు. . బాబా రాందేవ్ గురువారం (ఏప్రిల్-12) ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించారు. ప్రగతిభవన్‌ కు వచ్చిన బాబా రాందేవ్‌ కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. కారు వద్దకు వచ్చి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా తోడ్కొని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. మెమెంటోను అందించారు.

సీఎంతో ప్రజాసమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించిన బాబా రాందేవ్ అనంతరం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న నేత అని, రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్పష్టత ఉందని ట్వీట్ చేశారు. రైతులపై, గ్రామీణ, ఆర్థిక, న్యాయవ్యవస్థలకు సంబంధించిన అంశాలపై ఆయన ఆలోచనల్లో స్పష్టత, దూరదృష్టి కనిపించిందని ట్విట్ చేశారు బాబా రాందేవ్.


Posted in Uncategorized

Latest Updates