కేసీఆర్ ఓటు వేసేది ఇక్కడే..

సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రేపు డిసెంబర్-7న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీసమేతంగా వినియోగించుకోనున్నారు. కేసీఆర్ ఓటు వేసే పోలింగ్ బూత్ నంబర్-13, హెలిప్యాడ్ స్థలాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఇవాళ పరిశీలించారు.

చింతమడకలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సతీసమేతంగా ఓటు వేయనున్నారు. బూత్ నంబర్ 107 అంబిటస్ స్కూల్లో  ఉదయం  8 గంటలకు ఓటు వేయనున్నారు.  తెలంగాణ వ్యాప్తంగా 32వేల815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఎన్నికల కమిషన్.  పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates