కేసీఆర్ కిట్ తరహాలో…కేసీఆర్ స్కూలు బ్యాగులు

రాష్ట్రంలో ఇప్ప‌టికే మాతాశిశు సంర‌క్ష‌ణ కోసం ఇస్తున్న కేసీఆర్ కిట్ త‌ర‌హాలో..గురుకుల విద్యార్థుల‌కు కేసీఆర్ బ్యాగుల‌ను పంపిణీ చేస్తోంది ప్ర‌భుత్వం. మైనారిటీ గురుకులాల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు మ‌త్ర‌మే ఇస్తున్న ఈ బ్యాగులు ఆక‌ర్ష‌ణీయంగా,మ‌న్నిక‌గా ఉండ‌టంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో అధికారులు ఇప్ప‌టికే ఈ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ గులాబీ రంగు బ్యాగులపై సీఎం కేసీఆర్ చిరునవ్వుతో కూడిన ముఖచిత్రం ఆకట్టుకుంటోంది.

Posted in Uncategorized

Latest Updates