కేసీఆర్ కు అభినందనలు: జానారెడ్డి

ఎన్నికల ఫలితాలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న TRS పార్టీకి, ఆ పార్టీ అధినేత KCR కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఎన్నికల నిర్వహణలో జరిగిన పొరపాట్లు, అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్ల జాబితాలో ఓట్ల గల్లంతు ఎలా జరిగింది.. EVM, వీవీప్యాట్ లలో ఓట్ల వ్యత్యాసం తదితర అంశాల పై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని… లేదంటే న్యాయపరంగా తమ చర్యలు ఉంటాయన్నారు జానా.

దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడడం.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని, దానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల కృషి చేసిందన్నారు. ఇందులో భాగంగానే ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నానని, పదవి ఆశించి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో తమకు సహకరించిన కార్యకర్తలు, ప్రజల కృషి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు జానారెడ్డి.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates