కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగలేఖ

తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు తనకు లేఖ రాశారని తెలిపారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమిని హరీశ్ ముందుగానే ఊహించినందుకు… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. హ‌రీశ్ లేఖ ద్వారా మీరు ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన TRS వంద సీట్లు అనే క‌ల చెదిరిపోయిందని… మీరు ఇక ఫామ్ హౌజ్‌కు ప‌రిమిత‌మ‌య్యే స‌మ‌యం వ‌చ్చిందన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్వేచ్చ రాబోతోందన్నారు.

రాష్ట్ర సంపదను దోచుకొని మూఢ నమ్మకాలతో పాలించారన్నారు. ఎన్నికలంటేనే భయపడుతున్న కేసీఆర్ కు పొత్తులపై ఆందోళన చెందుతున్నారన్నారు. మీ పాలన బాగుంటే మీరు ప్రజల కోసం ఈ నాలుగురన్న ఏళ్ళ పాటు పనిచేసి ఉంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకు ఆందోళన అని అన్నారు ఉత్తమ్.

Posted in Uncategorized

Latest Updates