కేసీఆర్ కు ఉద్యమరత్న అవార్డ్

వరంగల్ అర్బన్: టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక బిరుదునిచ్చి గౌరవించింది ఓ స్వచ్చంద సంస్థ. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడారంటూ కేసీఆర్ ను సగౌరవంగా సత్కరించనుంది SR పౌండేషన్. కేసీఆర్ ను ‘ఉద్యమరత్న’ పురస్కార్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు శ్రీనివాస రామానుజ ఫౌండేషన్(SRF) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ అమిరేశ్. ఈసందర్భంగా ఆయన ఆదివారం డిసెంబర్-10న కమలాపూర్‌ లో ఒక పత్రికా ప్రకటన చేశారు.

సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన సీఎం కేసీఆర్ నాటి ఆమరణ దీక్ష రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచి రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా నిలిచారని.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి డిసెంబర్ -9కి తొమ్మిదేళ్లు పూర్తి కావడంతో.. తెలంగాణ ఉద్యమ రత్న పురస్కార్ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు పౌండేషన్ నిర్వాహకులు. త్వరలోనే ఈ అవార్డును కేసీఆర్ కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates