కేసీఆర్ కు స్వాగతం పలికిన దేవినేని ఉమ

DURGAMMA KCRతెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం (జూన్-28) ఫ్యామిలీతో కనకదుర్గమ్మకు మొక్కు తీర్చేందుకు విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ఏపీ మంత్రి దేవినేని ఉమ స్వాగతం పలికారు. కేసీఆర్ రాకతో విజయవాడలో భారీ బందోబస్తు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి అర్జునవీధి మార్గంలో ఇంద్రకీలాద్రి వద్దకు కేసీఆర్ చేరుకోనున్నారు.

మహామండపం వద్ద లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు ముక్కుపుడక సమర్పించి సీఎం కేసీఆర్ మొక్కు చెల్లించుకోనున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ బయల్దేరిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates