కేసీఆర్.. తెలంగాణ జాతిపిత : జోగు రామన్న

ఆదిలాబాద్ : అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడి అడుగుజాడల్లో అందరూ నడవాలన్నారు ఆపధర్మ మంత్రి జోగురామన్న. మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. తెలంగాణకు జాతిపితగా సీఎం కేసీఆర్ నిలిచిపోతారని చెప్పారు జోగు రామన్న.

దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నా, వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముని నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలోని పల్లెలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. డెబ్బై ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ జరగని అభివృద్ది.. కేసీఆర్ హయాంలో జరుగుతోందన్నారు.

Posted in Uncategorized

Latest Updates