కేసీఆర్ తో భేటీ కానున్న దేవెగౌడ

kcr devegoudaముఖ్యమంత్రి కేసీఆర్  భేటీ కోసం శనివారం (జూన్-30) హైదరాబాద్ పర్యనకు రానున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు దేవెగౌడకు స్వాగతం పలుకుతారు.

రాత్రికి కేసీఆర్ తో భేటీ కానున్న దేవెగౌడ.. దేశ రాజకీయాలు, ముందస్తు ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి, స్వయానా దేవేగౌడతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవేగౌడ హైదరాబాద్ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Posted in Uncategorized

Latest Updates