కేసీఆర్ ను కలిసిన అసదుద్దీన్

సీఎం కేసీఆర్ ను కలిశారు MIM అధినేత , హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఇవాళ డిసెంబర్-10న బుల్లెట్ పై ప్రగతి భవన్ కు వచ్చారు అసద్. రేపు ఎన్నికల ఫలితాలు వస్తుండడంతో… వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  రిజల్ట్స్ తో పాటు… తర్వాత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కొద్ది సేపటి క్రితం.. ట్విట్టర్లో ట్వీట్ చేశారు అసదుద్దీన్. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పారు అసద్. ఒంటరిగానే కేసీఆర్…. సర్కార్ ను ఏర్పాటు చేయాలని… అల్లాను ప్రార్థిస్తున్నామని చెప్పారు. తెలంగాణ నెక్స్ట్  సీఎం కేసీఆర్ ను కలవబోతున్నానని ట్వీట్లో వివరించారు. ఇది తమ మొదటి అడుగన్నారు అసద్.

అసెంబ్లీ ఫలితాలకు ముందు రోజు కేసీఆర్, అసదుద్దీన్ భేటీ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. హంగ్ వచ్చే పరిస్థితులు ఉంటే ఎలా వ్యవహరించాలనే దానిపై మాట్లాడుతున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ నేతలు MIM నేతలతో చర్చిస్తున్నారనే ఊహాగానాలకు అసద్ చెక్ పెట్టారు. తాము టీఆర్ఎస్ కు దోస్త్ గానే ఉన్నామని ఈ భేటీతో క్లారిటీ ఇచ్చారు. అటు MIM లేకుంటే తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తామని… పరోక్షంగా బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు బ్రేక్ వేశారు అసద్.

 

Posted in Uncategorized

Latest Updates