కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారు : ఉత్తమ్

UTTAMకేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పక్షానే నిలబడతారని చెప్పారు. గాంధీభవన్ లో పార్టీ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాతోపాటు ముఖ్యనేతలంతా కీలక సమావేశంలో పాల్గొన్నారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు నేతలు. ఇక కొత్తగా నియమించిన AICC కార్యదర్శులకు ఎంపీ స్థానాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు కుంతియా. కొత్తగా AICC కార్యదర్శిగా నియమితులైన ఎమ్మెల్యే సంపత్ ను సన్మానించారు నేతలు.

Posted in Uncategorized

Latest Updates