కేసీఆర్ పాలనను ఆంధ్రప్రజలు మెచ్చుకుంటున్నారు: కేటీఆర్

KTRరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన  అద్భుతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఆయన పాలనను ఆంధ్రా ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీలో కూడా  TRS శాఖ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో జరిగిన ప్రగతి సభలో మంత్రి పాల్గొన్నారు.

మధిర ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ప్రతిపక్షంలో లేరన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏ రోజు కూడా మధిరకు నిధులు కేటాయించలేదన్న మంత్రి.. TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత మధిర అభివృద్ధికి రూ. 15 కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తోందన్నారు. వృద్ధులు ఆత్మగౌరవంతో బతకడానికే రూ. 1000 పెన్షన్ ఇస్తున్నామన్న మంత్రి.. ఆసరా పెన్షన్లకు ఏడాదికి రూ. 5500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో సన్నబియ్యంతో పెడుతున్నం. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ. లక్షా 116 ఇస్తున్నాం. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

ఇంటింటికీ నల్లాతో నీరందించకపోతే ఓట్లడగనన్న దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్లపై నడవొద్దనే మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. మధిరలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates