కేసీఆర్ పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది : కేటీఆర్

కేసీఆర్ పై రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఆర్యవైశ్య సంఘం నేతలు ఆదివారం (సెప్టెంబర్-30)న తెలంగాణ భవన్‌ లో కేటీఆర్ సమక్షంలో TRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. TRSకు వేసే ఓటు KCRకు పోతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందన్నారు.

కాంగ్రెస్‌ కు ఓటేస్తే ఆ ఓటు ఢిల్లీకి పోతుందన్నారు కేటీఆర్. ఎక్కడ చూసినా TRSకే ఓటువేస్తామని ప్రజలంటున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈసారి కూడా కామారెడ్డిలో షబ్బీర్‌ అలీకి ఓటమి తప్పదని అన్నారు. ఈసారి గెలిస్తే షబ్బీర్ అలీపై తమకు ఐదో విజయం అవుతుందని చెప్పారు. గంప గోవర్థన్ మరోసారి భారీ మెజార్టీతో గెలువబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను బొందపెడుతామన్న టీడీపీ.. ఆ పార్టీతోనే జతకట్టిందన్నారు. కోదండరాం కాంగ్రెస్ మనిషైపోయిండని.. తెలంగాణ ప్రజల చావుకు కారణమైన పార్టీలతోనే కోదండరాం పొత్తుపెట్టుకుంటున్నారన్నారు. కోదండరాంది అడ్రస్‌ లేని పార్టీ అని చెప్పిన కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో TRSకు 100 సీట్లు వస్తాయన్నారు.

సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కోసం పోరాడారని.. తెలంగాణ రాగానే చంద్రబాబు 7 మండలాలను గుంజుకున్నాడన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నట్లు చెప్పాడు. కొన్ని ఎమ్మెల్యేల పదవుల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతిలో తాకట్టు పెడుతామా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. 60ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెసోళ్లకు తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని విమర్శించారు. చనిపోయిన వాళ్లపేర్ల మీద కేసులు వేసి ప్రాజెక్టులను ఆపేందుకు కుట్రలు చేశారు. మన నీళ్లు మనం తెచ్చుకుంటుంటే మోకాలు అడ్డుపెడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్.

 

 

Posted in Uncategorized

Latest Updates