కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగింది : మోత్కుపల్లి

NARSIHULUరాజకీయ కుట్రలకు బలి అయ్యాను అన్నారు మోత్కుపల్లి నర్సింహులు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 95వ జయంతి సందర్భంగా ఆయన  నివాళులు అర్పించారు. సోమవారం (మే-28) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నర్సింహులు.. తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్ రాజకీయ కుట్రలకు బలయ్యారని..చంద్రబాబు వల్లనే ఎన్టీఆర్ చనిపోయారన్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు మోత్కుపల్లి. దగ్గుబాటి ఫ్యామిలీ, హరికృష్ణ ఫ్యామిలీని చంద్రబాబు వాడుకుని వదిలేశాడన్నారు. రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంపిన చంద్రబాబు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబే కారణం అన్నారు మోత్కుపల్లి. పార్టీ నుంచి పంపించి వేయటానికి పార్టీలో కుట్ర జరుగుతుందన్నారు. పార్టీని నమ్ముకున్న వారి కంటే.. డబ్బున్న వారికే ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఏ అర్హత ఉండి రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో పార్టీ మనుగడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates