కేసీఆర్ బయోపిక్ కోసం.. బాహుబలి రైటర్

KCRFతెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే YSR బయోపిక్ వస్తుండగా..ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇందుకోసం గ్రేట్ బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు టాక్.  నివాస్‌ డైరెక్ట్‌ చేయబోతున్న ఈ సినిమా కోసం  విజయేంద్ర వర్మతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన  ఫోటో ఒకటి వైరల్‌ అవుతోంది. ఫస్ట్ ఈ మూవీ కేవలం డాక్యుమెంటరీగానే చిత్రీకరించాలని నిర్మాతలు భావించారట.

అయితే చివరకు దీనిని కమర్షియల్‌ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని నిర్ణయించినట్లు సమాచారం. బాహుబలి రైటర్‌ ఎంట్రీతో ఆ పని మరింత సులువు కానుంది. తారాగణం, మిగతా టెక్నీషియన్లపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates