కేసీఆర్ మగాడ్రా బుజ్జీ : TRS గెలవడంతో.. ఏపీలో ఫ్యాన్స్ సంబరాలు

ఏపీ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీతో కూడిన ప్రజాకూటమి ఓటమిపాలు అవ్వడంతో ఏపీలో కేసీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కారణాలు ఏమైతేనేమీ తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించడం కలిసిరాలేందంటున్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపును తమ గెలుపుగా భావించుకుంటూ ఏపీ అభిమానులు పలుచోట్ల సంబరాలు చేసుకోవడం విశేషం.

విజయవాడ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సందడి చేశారు. మొత్తానికి తెలంగాణలో ఒకే ఒక్కడు పోటీలోకి దిగి, భారీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ నిజంగా మగాడ్రా బుజ్జీ అని మాట్లాడుకుంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates