కేసీఆర్ మరో షేర్వాణి వేసుకున్న ఓవైసీ: లక్ష్మణ్

హైదరాబాద్:  నరేంద్ర మోడీ చరిష్మా తట్టుకోలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్ . యువరాజు పట్టాభిషేకం కోసం కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నాడని చెప్పారు.  కేసీఆర్ నిజమైన హిందువు కాదని.. షేర్వాణి వేసుకున్న మరో ఒవైసీ  అని విమర్శించారు. కేసీఆర్ చేసిన యాగాలన్నీ ఆయన స్వార్థం కోసమేనని అన్నారు.  కొండగట్టులో 60 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే పరామర్శించేందుకు రాని కేసీఆర్ హిందువు ఎలా అవుతారని ప్రశ్నించారు. అసదుద్దీన్ చంకలో దూరి మోడీని తిట్టడం మైనార్టీ ఓట్ల కోసం కాదా? అని అన్నారు. పుల్వామాలో జవాన్లు చనిపోయినప్పుడు ఉగ్రవాద స్థావరాలపై మన సైనికులు దాడిచేస్తే కేసీఆర్ అవమానించే విధంగా మాట్లాడరని విమర్శించారు.

కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినవి సర్జికల్ స్ట్రైక్ లు కాదని.. ప్రజలు స్ట్రైక్(సమ్మె) చేసారు అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఫ్యామిలీ ఫ్రంట్.. దాని టెంట్ కూలిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ దాటితే కేసీఆర్ చెల్లని రూపాయి అని అన్నారు. తెలంగాణను బారు, బీరుగా మార్చారని విమర్శించారు.  ఫామ్ హౌస్ పాలన కావాలనుకునే వాళ్లు టీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు. కేటీఆర్..మీ బావ హరీశ్ మెడలు వంచినంత సులభం కాదు ఢిల్లీ మెడలు వంచడం అని అన్నారు లక్ష్మణ్.

Latest Updates