కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు

హైదరాబాద్: రాష్ట్ర అపద్ధర్మ సీఎం,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ ఏపిలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు నాలుక కోసుకుని దేవుడి మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటన ఇవాళ(డిసెంబర్ 5) బంజారాహిల్స్ లోని ఓ ఆలయంలో జరిగింది. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో ఆయన పై అభిమానం పెంచుకున్న పశ్చిమగోదావరిలోని పోలవరం మండలానికి చెందిన మహేశ్ .. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ నాలుకను కోసి దేవాలయం హుండీలో కానుకగా వేశాడు.

అతన్ని స్థానికంగా ఉన్న హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో వైపు తెలంగాణలో కేసీఆరే మళ్లీ గెలవాలని ఆంధ్రా కేసీఆర్ ఫౌండేషన్ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం పుణ్యక్షేత్రంలో స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి.. ప్రత్యేక పూజలు చేశారు.

 

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates