కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదు : పార్టీలో కొనసాగుతానన్న ఆర్టీసీ చైర్మన్

రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు తాను పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు. 15 ఏళ్ల తన పొలిటికల్ కేరీర్ లో సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బాగా పనిచేస్తున్నారని…ఇలాంటి టీం ను వదిలి వెళ్లడం తనకు ఇష్టం లేదన్నారు. అంతకుముందు సోమారపు సత్యనారయణ లాంటి సీనియర్ల అవసరం పార్టీకి ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికలు వస్తున్న వేళ అస్త్ర సన్యాయం చేయడం సరికదాని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates