కేసీఆర్ సవాల్ కు కాంగ్రెస్ కౌంటర్ : ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

uttam-kumar-reddy-kcrముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్  విసిరిన సవాల్ కు పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్  రెడ్డి సై అన్నారు.  రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్వీట్ చేశారు.  ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార టీఆర్ఎస్ ను గద్దె దించుతామని ఉత్తమ్  స్పష్టం చేశారు. అవినీతిమయమైన టీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలికేందుకు కాంగ్రెస్  ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజలకు నిజంగానే శుభవార్తేనని.. కేసీఆర్ పాలన నుంచి కొన్ని నెలల ముందుగానే రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామని ట్వీట్ చేశారు.

డిసెంబర్ లో ఎన్నికలకు విపక్షాలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని సీఎం కేసీఆర్ సవాల్  విసిరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది టీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. విపక్షాలన్నీ కలిసినా.. టీఆర్ఎస్ ను ఏం చేయలేవన్నారు. సీఎం సవాల్ పై ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు ఉత్తమ్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ రెడీ అంటూ స్పష్టం చేశారు పీసీసీ చీప్.


Posted in Uncategorized

Latest Updates