కేసీఆర్ సోషల్ ఇంజినీర్ : హరీష్

harishసీఎం కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. గురువారం (జూన్-7) నాలుగేళ్ల ప్రగతి, ప్రాజెక్టులపై హైదరాబాద్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు నీరందించటమే తమ లక్ష్యమన్నారు. నీటిపారుదలశాఖ ఇంజనీర్లు, సిబ్బంది మంచి పనితీరు కనబరుస్తున్నారని అభినందించారు.

ప్రాజెక్టుల కింద చుక్క నీరు వృధా కాకుండా చూస్తున్నామన్నారు. గతంలో ప్రాజెక్టుల కింద నీటి విడుదల కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవని.. అయితే ఈ నాలుగేళ్లలో ధర్నాలు, దరఖాస్తులు లేకుండా నీరిచ్చామని చెప్పారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ ఏడాదిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 24 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందన్నారు. 60ఏండ్లలో సాధించనిది ఐదేండ్లలో సాధిస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ అద్భుతమైన పథకమని చెప్పిన హరీష్.. దేశవ్యాప్తంగా మిషన్ కాకతీయకు ప్రశంసలు వచ్చాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 12 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశామని చెప్పారు. భూగర్బ జలాలు కూడా పెరిగాయని.. ఈ పథకాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేస్తున్నాయన్నారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates