కేసీఆర్ హర్షం : కాళేశ్వరానికి టెక్నికల్ క్లియరెన్స్

Kaleshwaram TACకాళేశ్వరం ప్రాజెక్టుకు మరో కీలక అనుమతి దక్కింది. కేంద్ర జల వనరుల శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) బుధవారం (జూన్-7) ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో TAC  అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.  కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్న విషయం విదితమే. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇలా పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.

Posted in Uncategorized

Latest Updates