కైకాలకు విశ్వవిఖ్యాత నటసామ్రాట్ అవార్డు

kaikalasatyanarayana-1నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. విశాఖలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం సాగింది. రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపీఠం ఆధ్వర్యంలో కోటి లింగాలతో శివలింగాకృతిని ఏర్పాటుచేసి, భక్తులతో అభిషేకాలు చేయించారు. సినీ రంగంలో కైకాల చేసిన కృషికి ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. నాలుగు దశాబ్దాల సినీ పయనం.. 780 సినిమాల్లో నటించిన అనుభవం.. ఇదీ కైకాల సత్యనారాయణ ఘనత. ఆయన్ను చూసి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. సినీ రంగంలో వివిధ తరాలతో, అందరి నటులతో ఎన్నో పాత్రలు పోషించి… సంతృప్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఆయన తెలిపారు.

ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు కైకాల సత్యనారాయణ. సుబ్బరామిరెడ్డి ..తన సంపాదనలో కొంత కళాకారులకు ప్రోత్సహించడానికి ఖర్చుచేస్తున్నానని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates