కొండగట్టులో క్షేత్రశుద్ధి కోసం నారాయణ బలిశాంతి హోమం

కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో నారాయణ బలిశాంతి హోమం నిర్వహించారు. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో కొండగట్టులోని బస్సు ప్రమాదం జరిగిన స్థలంలో శాంతిహోమం నిర్వహించారు. ఈ హోమంలో ప్రముఖ అర్చకుడు బాచంపెల్లి సంతోష్ శర్మ, పూజారులు, మృతుల కుటుంబసభ్యులు, బంధు మిత్రులు హాజరయ్యారు.

క్షేత్ర శుద్ధి.. ఆత్మ శాంతి కోసం ఈ హోమం నిర్వహించామన్నారు పరిపూర్ణానంద. బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామన్నారు. కొండగట్టులో బస్ ప్రమాదంలో చనిపోయినవారి ప్రేతాత్మ విముక్తి కోరుతూ పరిపూర్ణానంద, సంతోష్ శర్మ.. దక్షిణ కాశి అయిన ధర్మపురి గోదావరిలో పిండ ప్రదానం వదిలారు.

Posted in Uncategorized

Latest Updates