కొండగట్టులో ఘనంగా హనుమాన్ చిన్న జయంతి

kondagattuతెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం హనుమాన్‌ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనెల 29 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. శనివారం నిర్వహించిన చిన్న జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి లక్ష మంది హనుమాన్‌ దీక్షాపరులు తరలివచ్చారు. వారు స్వామి వారికి ముడుపులు చెల్లించి, మాల విరమణ చేసి అంజన్నను దర్శించుకొన్నారు. ఈసందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు ఆలయ పూజారులు.

Posted in Uncategorized

Latest Updates