కొండచిలువతో ఆటలా… కాజల్ పై జంతు ప్రేమికులు సీరియస్

హైదరాబాద్ : హీరోయిన్ కాజల్ జంతు హింస వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లింది హీరోయిన్ కాజల్. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ రీసెంట్ గా థాయిలాండ్ లో జరిగింది. షూట్ లో భాగంగా ఓ కొండచిలువను మెడలో వేసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియోను ఇన్ స్టగ్రామ్ లో ఫ్యాన్స్ తో పంచుకుంది కాజల్.

కొండచిలువను మెడపై నుంచి చేతుల మీదుగా వేసుకున్నప్పుడు మొదట్లో బాగానే ఉన్నా.. అది బుసలు కొట్టినప్పుడు చాలా టెన్షన్ పడ్డాననీ కాజల్ చెప్పింది. ఈ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుందని కామెంట్ పెట్టింది.  కాజల్ పోస్ట్ చేసిన వీడియో కాంట్రవర్సీగా మారింది. ఫ్యాన్స్ క్యాజువల్ గానే తీసుకున్నా… జంతు ప్రేమికులు మాత్రం సీరియస్ అవుతున్నారు.

పెటా(PETA) సపోర్టర్ గా ఉండి కూడా… ఓ పాముతో ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నారు యానిమల్ యాక్టివిస్ట్స్. పాములకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అవి తమ బతుకు బతుకుతాయని… ఇలా బంధించి వాటిని హింసిస్తూ.. నవ్వుతూ వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం ఏంటి… నీకు అసలు బాధ్యత ఉందా అంటూ మండిపడుతున్నారు. పైథాన్ తో ఆటలాడిన కాజల్.. జంతు హింసను ప్రోత్సహిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తోందన్నారు.

View this post on Instagram

WHAT AN EXPERIENCE

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Posted in Uncategorized

Latest Updates