కొండ చిలువతో పరాచకాలు.. మెడకు చుట్టేసింది

pythonbengalఅతిగా స్పందించాడు ఓ అధికారి.. కొండచిలువతోనే సెల్ఫీ దిగాలనుకున్నాడు.. మెడను గట్టిగా చుట్టేసింది పైథాన్.. ఉక్కిరి బిక్కిరయ్యాడు.. ముచ్చేమటలు పట్టాయి ఆ అటవీశాఖ అధికారికి. గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువను పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ పైథాన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. అది ఆయన మెడను ఒక్కసారిగా చుట్టేసింది. అక్కడున్న వారు అప్రమత్తమై కొండచిలువను లాగేశారు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

కోల్‌కతాకు 610 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువ మేకను తినేసింది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీశాఖ అధికారి సంజయ్‌ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సంజయ్.. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న కొండచిలువను స్థానికుల సహాయంతో తన మెడలో వేసుకున్నారు. సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా అధికారి మెడను ఫైథాన్ చుట్టేసింది. ఆ తర్వాత పైథాన్‌ను తీసుకెళ్లి సమీప అడవిలో వదిలేశారు.

Posted in Uncategorized

Latest Updates