కొడుకును సీఎం చేయడానికే అసెంబ్లీ రద్దు.. అమిత్ షా

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్ర నేతలు, నల్గొండ, నాగర్ కర్నూలు, మెదక్, మహబూబ్ నగర్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇంచార్జిలు, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట నియోజక వర్గాల బూత్ లెవెల్  అధ్యక్షులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడిన అమిత్ షా.. “ తెలంగాణలో బీజేపీ రాజకీయ శక్తిగా మారబోతోంది. బీజేపీ 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా మారింది. కేరళ, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో గెలిస్తేనే సంపూర్ణ విజయం సాధించినట్టు అవతుంది. కేసీఆర్ ఒవైసీ కోసమే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. 12 శాతం మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తే బీసీ, దళితులకు అన్యాయం చేసినట్టే. కొడుకునో, కూతురినో ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు” అని అన్నారు.

ఇదే మీటింగ్ లో .. అమిత్ షా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాగర్ కర్నూల్ నేత దిలీప్ ఆచారి, కొత్తగూడెం ప్రజారాజ్యం మాజీ నేత కుంచె రంగా కిరణ్ బీజేపీలో చేరారు.

Posted in Uncategorized

Latest Updates