కొత్తకోటలో రెండు కార్లు ఢీ : ఏడుగురి మృతి

accidentవనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ముందు టైరు పగిలి అదుపుతప్పి కర్నూలు నుంచి హైదరాబాద్ కు వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు పురుషులు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates