కొత్తది వచ్చేసింది : 14 నుంచి రెడ్‌మి 5 సేల్స్

redmi note 5చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి 2018లో మొదటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్‌మి 5, 5 ప్లస్‌ భారత్ లోకి తీసుకొస్తుంది. ఫిబ్రవరి 14 లవర్స్ డే నుంచి సేల్స్ ప్రారంభించనుంది. చైనాలో 2017 డిసెంబర్‌లోనే లాంచ్‌ చేసింది. బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ వేరియంట్లలో అందుబాటులో వస్తుంది. రెడ్‌మి 5 స్టార్టింగ్ ధర రూ.8,100 ఉండగా.. 5 ప్లస్‌ రూ.10వేల 200 నుంచి ప్రారంభం అవుతుంది. భారత్‌లో ఈ ఫోన్‌ ధర 5శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మి 5 ఫీచర్స్:

డిస్ ప్లే : 5.7 అంగుళాలు, 2GB/ 3GB / 4GB ర్యామ్‌, 16 GB/ 32 GB ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ios, 3300 mAh బ్యాటరీ

రెడ్‌మి 5 ప్లస్‌ ఫీచర్స్ :

డిస్‌ ప్లే : 5.99 అంగుళాలు, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ios, 3 GB/ 4 GB ర్యామ్‌, 32 GB/ 64 GB ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 4000 mAh బ్యాటరీ

Posted in Uncategorized

Latest Updates