కొత్త అనుమానాలు : భర్త బోనీకపూర్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు

Dubai-Srideviచనిపోయి 48 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు తీవ్ర గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)తో శ్రీదేవి చనిపోయింది అని అందరూ అనుకున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత వార్తలకు భిన్నంగా బాత్ టబ్ లో పడి చనిపోయిందని రిపోర్ట్ చెబుతోంది. ఇదే నివేదికలో శరీరంలో ఆల్కాహాల్ సేవించినట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడే మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్పృహ లేని స్థితిలో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి చనిపోవటం అంటే.. మద్యం మితిమీరి సేవించిందా లేక ఇంకేమైనా కారణాలు కూడా ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్ పోలీసులు ఈ కేసును మళ్లీ విచారిస్తున్నారు.

శ్రీదేవి డెత్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు కొత్త టర్న్ తీసుకుంది. పోరెన్సిక్ రిపోర్టులను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేశారు. శ్రీదేవిది ప్రమాదమా లేక ఇంకేమైనా ఉందా అనే విషయాలపై భర్త బోనీకపూర్ ను విచారిస్తున్నారు. రెండు గంటలు ప్రశ్నించారు. కేసు మళ్లీ రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. దీంతో శ్రీదేవి మరణంపై అనుమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

మేనల్లుడి పెళ్లి తర్వాత రెండు రోజులు ఒంటరిగానే దుబాయ్ లో ఉంది శ్రీదేవి. శనివారం సాయంత్రం దుబాయ్ మళ్లీ వెళ్లాడు భర్త బోనీకపూర్. ఆ తర్వాత శ్రీదేవి చనిపోయింది. బాత్ టబ్ లో పడి చనిపోవటం.. ఆ సమయంలో స్పృహలేని స్థితిలో ఉంది అని పోస్టుమార్టం నివేదిక వెల్లడి కావటంతో.. కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే బోనీకపూర్, శ్రీదేవి కాల్ డేటాను కూడా బయటకు తీస్తున్నారు. ఇద్దరు ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు అనేది తేల్చనున్నారు. మళ్లీ బోనీకపూర్ ముంబై నుంచి దుబాయ్ ఎందుకు వెళ్లాడు అనేది కూడా తేలాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates