కొత్త ఎస్‌ఐలు వస్తున్నారు

 ట్రేనింగ్ ను పూర్తిచేసుకున్న ఎస్‌ఐల పాసింగ్ ఔట్ పరేడ్ ఆదివారం హకీంపేట లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్, రాష్ట్రం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఎస్ఏ)లో ఈ కార్యక్రమం జరిగింది. 230 మంది ఎస్‌ఐలు, 24 మంది సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.  గౌరవ వందనాన్ని స్వీకరించిన తరువాత హన్స్‌రాజ్ ప్రసంగించారు. సైన్యమే స్ఫూర్తిగా పనిచేయాలని హన్స్‌రాజ్ అన్నారు. ప్రజలతో కలిసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని చెప్పారు.  సైబర్ క్రైమ్ ను అరికట్టడంలో పోలీసులు సమర్ధంగా పనిచేస్తున్నారని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates