కొత్త జిల్లాలకు అనుకూలంగా.. రాష్ట్రంలో నాలుగు జోన్లు

Telangana-Map-Newతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న రెండు జోన్లను నాలుగు జోన్లుగా మార్చేలా ముసాయిదా సిద్ధమైంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సీఎం కేసీఆర్ కు నివేదిక అందజేసినట్టు తెలిసింది. పాతజిల్లాలైన మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలు ఒక జోన్‌ గా, హైదరాబాద్, రంగారెడ్డి ఇంకో జోన్‌ గా, నల్లగొండ, మహబూబ్‌ నగర్ మరో జోన్‌ గా, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు నాల్గోజోన్‌ గా ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ జోనల్ వ్యవస్థను ఖరారుచేసే క్రమంలో స్థానికతకు, ప్రధానంగా 1వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు ఎక్కడ చదివితే దానినే స్థానికతగా గుర్తించాలని ప్రతిపాదించినట్టు సమాచారం.

జోనల్ వ్యవస్థపై చర్చించి, మార్పులు, చేర్పులు సూచించాలని సీఎం కేసీఆర్ ఉద్యోగులను కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఈ విషయమై చర్చించే బాధ్యతను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం (మే-18) నుంచి ఉద్యోగసంఘాల నేతలతో చర్చలు జరుపనున్నారు. ఉద్యోగసంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను అందచేస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు కావాల్సిన సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నది.

Posted in Uncategorized

Latest Updates