కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకు ప్రాధాన్యం: సీఎం కేసీఆర్

హైకోర్టు విభజన త్వరగా పూర్తి చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరారు సీఎం కేసీఆర్. హైకోర్టు విభజనతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తైనట్లు తెలంగాణ ప్రజలు భావిస్తారన్నారు. గతంలోనూ పలుసార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం నిన్న (శుక్రవారం,ఆగస్టు-3) కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. సీఎస్ ఎస్ కే జోషి, ఎంపీ వినోద్ కుమార్ కేసీఆర్ వెంట ఉన్నారు.

కొత్త జోనల్ వ్యవస్థపై రవిశంఖర్ ప్రసాద్ తో చర్చించారు సీఎం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడదలయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత జోనల్ విధానం వల్ల ఉద్యోగాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించలేకపోతున్నామన్నారు. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకు 95 శాతం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.అసెంబ్లీ సీట్ల పెంపుపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపు పై తీర్మానాలు  పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు కేసీఆర్. స్పాట్..

ఇవాళ (శనివారం,ఆగస్టు-4) సాయంత్రం నాలుగు గంటలకు ప్రదాని మోడీతో భేటీ కానున్నారు కేసీఆర్. కొత్త జోనల్ వ్యవస్థ, హైకోర్టు విభజన, కాళేశ్వరానికి ఆర్థిక సాయం, రక్షణ భూములు కేటాయింపు … మొత్తం 10 అంశాలపై మోడీకి కేసీఆర్ వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

 

Posted in Uncategorized

Latest Updates