కొత్త జోన్లకు కేబినెట్ ఆమోదం.. అన్ని పోస్టుల్లో 95 శాతం స్థానికులకే

joneరాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రి వర్గం. రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టులన్నింటీని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ క్యాటగిరీలుగా నియమకాలు చేపట్టాలని డిసైడ్ చేసింది. రైతు జీవిత బీమా పథకానికి క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆదివారం (మే-27) ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రంలో స్థానికత ప్రతిపాదనలను కేబినెట్ ఖరారు చేసింది. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు  ఎక్కడ చదివితే… ఆ ప్రాంతాన్నే అభ్యర్థి లోకల్ ఏరియాగా గుర్తించాలని నిర్ణయించింది. జోగులాంబ జోన్ లోనే వికారాబాద్ జిల్లాను కొనసాగించాలని నిర్ణయించింది. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు 371డీ ఆర్టికల్ ను సవరించాలని ప్రధానమంత్రిని కోరేందుకు… కేబినెట్ మీటింగ్ తర్వాత ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్. అగ్రవర్ణాలకు ప్రభుత్వ పథకాల వర్తింపు విషయం కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం (మే-28) ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates