కొత్త టెక్నాలజీని ఆహ్వానిస్తున్నాం: రవిశంకర్‌ప్రసాద్

ravishankerprasad (1)టెక్నాలజీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్. హైటెక్స్‌లో ఈ రోజు(ఫిబ్రవరి19) జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ… భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తుందని, 125 కోట్ల భారత ప్రజలు అత్యాధునిక డిజిటల్ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని తెలిపారు. 60 లక్షల మంది పౌరులను డిజిటల్ అక్షరాస్యులను చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కంప్యూటర్ లు వస్తే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు.. కానీ అలా జరగలేదని, కొత్త టెక్నాలజీతో సవాళ్లతో పాటు, ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. భారతీయులు టెక్నాలజీని ఆహ్వానిస్తున్నారని ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates