కొత్త నోటిఫికేషన్ వస్తుందిలే : 13 వేల మంది రైల్వే ఉద్యోగుల తొలగింపు

raiwayరైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి సమాచారం లేకుండా.. విధులకు డుమ్మా కొడుతున్న వారిపై వేటు వేయాలని డిసైడ్ అయ్యింది. 13 లక్షల మంది ఉద్యోగుల్లో.. 13వేల మంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా లాంగ్ లీవ్ లో వెళ్లిన వారిపై వేటు వేయాలని నిర్ణయించారు ఉన్నతాధికారులు. ఎక్కువ కాలం సెలవులు పెట్టిన ఉద్యోగులను శాశ్వితంగా ఇంటికి పంపించాలని డిసైడ్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి వారు 13వేల మంది ఉన్నట్లు గుర్తించింది. త్వరలోనే విధుల నుంచి తొలగించనున్నారు.

రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు.. ఉద్యోగుల్లో నిబద్ధతను పెంచేందుకు  రైల్వేశాఖ డ్రైవ్‌ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా కాలంగా సెలవులో ఉంటున్న సిబ్బంది వివరాలను సేకరించింది. 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మంది కొన్ని సంవత్సరాలుగా అనధికారికంగా సెలవులో ఉన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యల కింద ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. వీరి స్థానంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates