కొత్త పార్టీ పెడతా..రాజకీయాల్లోకి వస్తా: కోదండరామ్

kodandaramరాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన JAC చైర్మన్ కోదండరామ్… రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తుర్కయాంజల్ లో జరిగిన JAC విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కోదండరామ్…కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న కోదండరామ్… రైతుల కోసం పెద్ద పోరాటమే చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. JACతో పాటు పార్టీ సమన్వయంగా ముందుకు పోతుందన్నారు కోదండరామ్. ఈ నెల చివరి లోగా పార్టీ పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు

2019 ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించాలన్నారు ప్రజా గాయకుడు గద్దర్. రైతుల సమస్యలపై సర్కార్ స్పందించాలన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates