కొత్త పోస్టులు ఇవి : బీసీ గురుకులాల్లో 4వేల 284 ఉద్యోగాలు

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 4వేల 284 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. 2019-20 విద్యా సంవత్సరంలో 119 బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో గురుకులానికి 35 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ పోస్టులను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSREIRB) ద్వారా భర్తీ  చేయనున్నారు.

ప్రతి గురుకులంలో పోస్టులు ఇలా ఉన్నాయి. ప్రిన్సిపాల్‌ – 1, టీజీటీ – 9, పీజీటీ – 7, జేఎల్‌ – 7, పీఈటీ – 1, పీడీ – 1, స్టాఫ్‌నర్స్‌ – 1, సీనియర్‌ అసిస్టెంట్‌ – 1, జూనియర్‌ అసిస్టెంట్‌ – 1, లైబ్రరియన్‌ – 1, ఐసీటీ – 1, అటెండర్‌ – 1, ల్యాబ్‌ అటెండర్‌ – 1, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ టీచర్‌ – 1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ 5వేల 300 గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన 4వేల 284 ఉద్యోగాల భర్తీని.. పాత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారా లేక కొత్తగా నోటీఫికేషన్ జారీ చేస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates