కొత్త ప్రభుత్వం 63శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి.. టీఎన్జీవోల డిమాండ్

కరీంనగర్ :  కరీంనగర్ పట్టణంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మీటింగ్ నిర్వహించారు. ఫిట్‌మెంట్‌ సహా డిమాండ్ల సాధనకు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ పాల్గొన్నారు. టీఎన్జీవోలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. తమ డిమాండ్ల సాధనకోసమే పోరాడుతున్నామని చెప్పారు కారెం రవీందర్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల తర్వాత… టీఎన్జీవోలకు 63శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

టీఎన్జీవో సెక్రటరీ మామిండ్ల రాజేందర్  మాట్లాడుతూ.. “సీఎం హామీ ఇచ్చినా కూడా పీఆర్సీ పై ప్రకటన చేయలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్… ఎన్నికల కమిషన్ తో మాట్లాడి పీఆర్సీ ప్రకటించాలి. ఉద్యోగస్తులం తలుచుకుంటే కోటి ఇరవై లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతాం. ఉద్యోగులు నిరాశ చెందొద్దు. కాస్త లేటయినా.. పీఆర్సీ సాధించకుందాం” అని చెప్పారు.

ఈ నెల 11వ తేదీన 31 జిల్లాలలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగుతాయని.. ఉద్యోగులంతా పాల్గొనాలని చెప్పారు నాయకులు.

Posted in Uncategorized

Latest Updates