కొత్త ప్రయోగం : షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ ట్యాబ్లెట్స్

insuline-tabsషుగర్ పేషెంట్ల కోసం ఓ సరికొత్త ఇన్సులిన్ పిల్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు భారత సైంటిస్టులు. షుగర్ వ్యాధి ఒక స్టేజ్ దాటితే ఇంజెక్షన్ చేసుకోవాల్సిందే. బాధ కలిగినా తప్పదు. అయితే ఈ బాధ నుంచి షుగర్ రోగులకు కస్త ఉపశమనం కలిగించేలా ఇన్సులిన్ పిల్ ను కనిపెట్టారు సైంటిస్టులు. ఈ పిల్ ను త్వరలోనే రోగులకు అందుబాటులోకి తేనున్నట్లు బుధవారం (జూన్-27) తెలిపారు భారత సైంటిస్ట్ సమీర్ మిత్రగోత్రి. సూది నొప్పికి భయపడి చాలామంది ఇన్స్ లిన్ అనగానే ఇబ్బంది పడతారని తెలిపారు.

నీడిల్ ఫోబియా కూడా ఇందుకు ఒక కారణం. అయినా తప్పదన్నారు. చోలిన్ జెరనిక్ యాసిడ్ లతో కలిసి ఉండే ఐకానిక్ లిక్విడ్ ఇన్సులిన్ క్యాప్సుల్ లో ఉంటుందన్నారు. మెడిసిన్ దెబ్బతినకుండా చల్లగా ఉండే ప్రదేశాల్లో రెండు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ మెడిసిన్ ఒక స్విస్ కత్తిలా అన్ని ఆటంకాలను అధిగమిస్తూ పనిచేస్తుందని తెలిపారు సమీర్. పేగుల్లోకి ఇన్స్ లిన్ వెళ్లగానే ప్రోటీన్లను నశింపజేసే ఏంజైమ్ లు చిన్నపాటి అమినో యాసిడ్ లుగా మారిపోతాయని తెలిపారు..ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన మరో సైంటిస్ట్ అమ్రిత బెనర్జీ. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేశాకే మార్కెట్లోకి విడుదల చేస్తామని వెల్లడించారు సైంటిస్టులు.

Posted in Uncategorized

Latest Updates