కొత్త ఫీచర్: వాట్సప్ తో మనీ ట్రాన్స్ ఫర్

whatsappస్మార్ట్ ఫోన్ యూజర్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని యాప్ వాట్సప్ మెసెంజర్. ప్రతీ ఒక్కరు ఉదయం లేచింది మొదలు…వాట్సప్ లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ మెసేజ్ లను చాట్ చేస్తూనే ఉంటారు. దీనికి అనుగుణంగా వినియోగదారుల అవసరాల కోసం ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తోంది వాట్సప్. ఇందులో భాగంగానే మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

యూనిఫైడ్ పేమెంట్స్  ఇంటర్ ఫేస్ (UPI) ఫీచర్‌తో మరింత మంది భారత కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో పేమెంట్స్‌ ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ ఎంపిక చేసిన IOS, ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో UPI ఆధారితంగా.. డబ్బులను వేరే వాళ్లకి పంపించడం, వేరే వాళ్ల ద్వారా నగదును యూజర్లు పొందడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ IOS ని 2.18.21 వాట్సాప్‌ వెర్షన్‌కు, ఆండ్రాయిడ్‌ 2.18.41 వెర్షన్‌ వారికి అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారత్‌లో డిజిటల్‌ పేమెంట్లు ఎక్కువగా పెరగడంతో.. పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆఫర్‌చేసి మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని వాట్సాప్‌ నిర్ణయించింది.

గిజ్మో టైమ్స్‌లో ఈ వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ మొదట స్పాట్‌ అయింది. చాట్‌ విండోలోనే ఈ ఫీచర్‌ను యూజర్లు యాక్సస్‌ చేసుకోవచ్చు. గేలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్‌ కూడా ఇక అందుబాటులో ఉంటుంది. పేమెంట్స్‌ను క్లిక్‌ చేస్తే.. ఓ డిస్క్లైమర్ విండో ఓపెన్‌ అవుతుంది. ఇందులో బ్యాంకుల లిస్టు కూడా ఉంటుంది. యూపీఐతో కనెక్ట్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు UPI పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను మీరు యూజ్ చేయనట్లయితే…అవసరమైన పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అదనంగా యూపీఐ యాప్‌ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా UPI అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. లావాదేవీలు విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే డబ్బులు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి.

Posted in Uncategorized

Latest Updates