కొత్త మండలంలో కలిపారని : ఊరినే ఖాళీ చేసిన గ్రామస్ధులు

లదునలమలదకొత్త మండలాల ఏర్పాటు… ఆ ఊరును విడదీసింది. కొత్త మండలంలో ఆ ఊరిని కలిపారంటూ.. ఊరునే ఖాళీ చేశారు. పాత మండలానికి దగ్గర్లో కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టారు . పెద్ద ఇళ్లు వదిలి.. గుడిసెల్లోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం స్పందించే వరకు…. గ్రామంలోకి వెళ్లమంటోన్నారు ఆదిలాబాద్ జిల్లా మల్లాపూర్ గ్రామస్ధులు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో గ్రామస్తులు అంతా కలిసి ఓ ఊరినే ఖాళీ చేశారు. కొత్త మండలాల పేరుతో తమ గ్రామం మల్లాపూర్ ను కొత్తగా ఏర్పాటు చేసిన సిరికొండ మండలంలో కలపడంతో నిరసనగా ఊరిని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లి కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్నారు. మల్లాపూర్ గ్రామంలో మొత్తం 80 కి పైగా గిరిజన కుటుంబాలున్నాయి. తమ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలంలోనే ఉంచాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఊరునే ఖాళీ చేయాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. మల్లాపూర్ గ్రామానికి 250 మీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలం గౌరపూర్ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు కలిపిన సిరికొండ మండలం.. ఈ గ్రామం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమ గ్రామాన్ని పాత మండలంలోనే కొనసాగించాలని .. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదంటున్నారు గ్రామస్థులు. మల్లాపూర్ గ్రామాన్ని తిరిగి ఇంద్రవెల్లిలో కలిపే వరకు ఎన్నికలను బహష్కరిస్తామంటున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని తీర్మానం చేశారు గ్రామస్ధులు. తమ గ్రామాన్ని సిరికొండ మండలంలో కలిపినప్పటి నుండి.. ఏ ఒక్క అధికారి కానీ, నాయకుడు కానీ తమ గ్రామం వైపు రావడం లేదంటున్నారు స్థానికులు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. తమ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలంలోనే ఉంచాలంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates