కొత్త రాష్ట్రం తెలంగాణ కాదు..ఏపీ : గల్లా జయదేవ్

పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు అన్నారు.  శుక్రవారం (20) పార్లమెంట్ వర్షాకాల సమావేశ సందర్భంగా ఆయన మాట్లాడారు. TDP తరుఫున చర్చను ప్రారంభించిన ఎంపీ గల్లా జయదేవ్.. భరత్ అనే నేను సినిమా ప్రస్థావన తీసుకువచ్చారు.  ఎన్డీయే నుంచి బయటికి రాగానే టీడీపీ మోడీ సర్కార్ కుట్ర చేసిందన్న గల్లా..ఏపీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు..ఏపీ అని..ఆంధ్రప్రదేశ్ కు తీరని లోటు ఉందన్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, టీడీపీ ఎంపీల మధ్యన గొడవ మొదలైంది.

జయదేవ్ ప్రసంగంపై టీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. తమకు మాట్లాండేందుకు అవకాం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. విభజన అప్రజాస్వామికం అనడంతో టీఆర్ఎస్ ఎంపీలు సీరియస్ అయ్యారు.  ఆ తర్వాత అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన గల్లా..టీడీపీ ధర్మ పోరాటం చేస్తుందన్నారు. మోడీ పాలన ఏపీకి మరిన్ని సవాళ్లు విసిరిందన్నారు. ఏపీకి ఇచ్చిన సంస్థలు పూర్తయ్యేవరకు ఇంకా చాలా సమయం పడుతుందన్నారు. విభజన తర్వాత 90శాతం ప్రాజెక్టులు తెలంగానకే పోయాయని, విద్యుత్, పన్నులు విధించడంతో ఏపీకి తీరని లోటు ఏర్పడిందని చెప్పారు గల్లా. ఏపీని లోటు బడ్జెట్ లో వదిలేశారని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates